Mallikarjun Kharge: మోడీ కశ్మీర్ పర్యటన రద్దు అందుకే..- పహెల్గాం ఉగ్రదాడిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

“పహెల్గాంలో భద్రత ఎందుకు కల్పించలేదు” అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పహెల్గాం ఉగ్రదాడిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

Mallikarjun Kharge: మోడీ కశ్మీర్ పర్యటన రద్దు అందుకే..- పహెల్గాం ఉగ్రదాడిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: “పహెల్గాంలో భద్రత ఎందుకు కల్పించలేదు” అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పహెల్గాం ఉగ్రదాడిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘సంవిధాన్‌ బచావో’ పేరుతో రాంచీ వేదికగా నిర్వహించిన సభలో ఖర్గే మాట్లాడారు. ‘‘దేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పహెల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఇంటెలిజెన్స్‌ను కట్టుదిట్టం చేస్తామని వాళ్లే చెప్పారు. దాడికి మూడు రోజుల ముందే నిఘా సమాచారం ఉందని నాకు తెలిసింది. అందుకే మోడీ కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఓ పేపర్లో చదివా. అలాంటప్పుడు పహెల్గాంలో తగినంత భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నా ’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

కేంద్రానికి మద్దతు..

కాగా.. పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశమే తొలి ప్రాధాన్యమన్నారు. రాజకీయ విభేదాలకంటే జాతీయ ఐక్యతే ముఖ్యమని అన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడమే మోడీ విధానమని ఆరోపించారు. ఆదివాసీలను భయపెట్టే ధోరణిని మానుకోవాలని కేంద్రానికి సూచించారు.

Next Story