నేడు దేశవ్యాప్తంగా పీఎం ధన్ ధాన్య యోజన పథకం ప్రారంభం.. ఏపీ, టీజీలో ఎంపికైన జిల్లాలు ఇవే!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-11 03:17:28  IST  )

రైతుల కోసం కేంద్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న ప‌థ‌కాన్ని నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించ‌నున్నారు. వ్య‌వ‌సాయాన్ని అభివృద్ధి చేయ‌డం, రైతుల ఆదాయం పెంచ‌డం కోసం ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు.

నేడు దేశవ్యాప్తంగా పీఎం ధన్ ధాన్య యోజన పథకం ప్రారంభం.. ఏపీ, టీజీలో ఎంపికైన జిల్లాలు ఇవే!
X

దిశ‌, వెబ్ డెస్క్: రైతుల కోసం కేంద్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న ప‌థ‌కాన్ని నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించ‌నున్నారు. వ్య‌వ‌సాయాన్ని అభివృద్ధి చేయ‌డం, రైతుల ఆదాయం పెంచ‌డం కోసం ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. ప‌థ‌కం ద్వారా వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వారికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నారు.

కాగా మొద‌టిద‌శలో ఉత్పాద‌క ఉన్న‌ 100 వ్య‌వ‌సాయ‌క జిల్లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ప‌థ‌కం మొద‌టిద‌శలో తెలంగాణ‌లోని జ‌న‌గామ‌, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల‌, నాగ‌ర్ క‌ర్నూల్లో ప్ర‌వేశ‌పెడ‌తారు. అదే విధంగా ఏపీలోని అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ప్రారంభించ‌నున్నారు. ప‌థ‌కం అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఇప్ప‌టికే కొంత‌మంది అధికారుల‌ను సైతం ఎంపిక చేశారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ల‌క్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశ్యంతో కేంద్రం దీనిని ప్ర‌వేశ‌పెట్టింది.

Next Story