- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM CARES: పీఎం సహాయనిధికి పోటెత్తిన విరాళాలు
కోవిడ్ మహమ్మారి తర్వాత పీఎం సహాయనిధికి (PM CARES) విరాళాలు పోటెత్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎం సహాయనిధికి రూ.912 కోట్ల విరాళాలు వచ్చాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి తర్వాత పీఎం సహాయనిధికి (PM CARES) విరాళాలు పోటెత్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎం సహాయనిధికి రూ.912 కోట్ల విరాళాలు వచ్చాయి. స్వచ్ఛంద విరాళాలుగా రూ. 909.64 కోట్లు, విదేశీ విరాళాలుగా రూ. 2.57 కోట్లు వచ్చాయి. విరాళాలతో పాటు, వడ్డీ ఆదాయంగా రూ.170.38 కోట్లు కూడా పీఎం కేర్స్ కు ముట్టాయి. ఇందులో రూ.154 కోట్లు సాధారణ ఖాతాలపై వడ్డీ ద్వారా, రూ.16.07 కోట్లు విదేశీ విరాళాల ఖాతా నుంచి వచ్చాయి. అంతేకాకుండా రూ.225 కోట్లు రీఫండ్ ల రూపంలో వచ్చాయి. ఇక, కేంద్రం సహా ఇతర రాష్ట్రాలు నిర్వహించే ప్రభుత్వ ఆస్పత్రులకు 50 వేల ‘మేడ్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లు అందజేయడంతో రూ.202 కోట్లు రీఫండ్ లుగా వచ్చాయి.
రూ. 439 కోట్ల పంపిణీ
కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎం సహాయనిధి నుంచి అవసరాల కోసం మొత్తం రూ. 439 కోట్లను పంపిణీ చేసింది. పిల్లల కోసం రూ. 346 కోట్లు... 99,986 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సేకరణకు రూ. 91.87 కోట్లు.. రీఫండ్ లపై రూ. 1.51 కోట్లు, ఇతర ఛార్జీల రూపంలో రూ.24 వేలు ఖర్చయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాలెన్స్ రూ. 6,284 కోట్లుగా ఉంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 5,416 కోట్లతో పోలిస్తే 16 శాతం ఎక్కువ. 2020-21 చివరి నాటికి రూ. 7,014 కోట్లు, 2019-20 చివరి నాటికి రూ. 3,077 కోట్లుగా పీఎం సహాయనిధి ముగింపు బ్యాలెన్స్ ఉంది. మొత్తం మీద పీఎం సహాయనిధికి 2019-20 నుండి 2022-23 వరకు.. ఇలా నాలుగేళ్లలో మొత్తం రూ. 13,605 కోట్లు విరాళాలు అందాయి. స్వచ్ఛంద విరాళాలు రూ. 13,067 కోట్లు కాగా.. విదేశీ విరాళాలు రూ. 538 కోట్లుగా ఉన్నాయి. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలో రూ.565 కోట్లు వడ్డీగా అందింది.






