పాముతో ఆటలే పరేషాన్.. కానీ ఓ వ్యక్తి నాలుకతో తాకుతూ.. చివరికి!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-15 13:15:20  IST  )

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

పాముతో ఆటలే పరేషాన్.. కానీ ఓ వ్యక్తి నాలుకతో తాకుతూ.. చివరికి!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. ఇక పాముల వీడియోలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే.. నిత్యం నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి. ప్రతి రోజూ వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన కొందరు నెటిజన్లు కెమెరాలో బంధించి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో(Video)లు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి పాముతో ఆటలు ఆడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అసలు విషయంలోకి వెళితే.. యూపీ(Uttar Pradesh)లోని అమ్రోహాలోని గజ్రౌలా హైవత్‌పూర్ గోసైన్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న జీతూ ఓ పామును పట్టుకున్నాడు. దానిని మెడకు చుట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన నాలుకతో తాకుతూ ఆటలు ఆడాడు. అది నాలుక పై కాటేయడంతో కిందపడి స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

విషపూరిత పాము కాటు కారణంగా ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గజ్రౌలాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ పాము పాత గోడ నుంచి బయటకు రావడంతో ఆ వ్యక్తి దానిని సరదాగా పట్టుకుని, మెడకు చుట్టుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.

Twitter Link

Next Story