- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే?
గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Boeing) జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా స్థానికులు అక్కడికి చేరుకోగా.. అక్కడ దట్టమైన మంటలు, పొగలు అలుముకున్నాయని, భారీ శిథిలాలు కనిపించాయని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల(Eyewitness) వివరాల ప్రకారం.. " నేను ఇంట్లో ఉన్నప్పుడు బయట భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అని, అందరితోపాటు పరుగెత్తుకొని వెళ్ళి చూడగా.. ఆకాశంలో దట్టమైన పొగలు కనిపించాయి. ఘటనా స్థలంలో భారీగా మంటలు వ్యాపించాయి.
భారీ శకలాల మధ్య అనేక శరీర భాగాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనేక మంది గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు.." అని తెలియజేశారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహ 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా బయట పడ్డాడు. దాదాపు 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు.






