- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదం.. మరో నలుగురు మెడికోలు మృతి
అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. అయితే విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ(BJ Mediacal College) హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో.. 24 మంది మెడికల్ విద్యార్థులు(Medico's Died) అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో మరో నలుగురు నేడు ప్రాణాలు విడిచారు. కాగా మరికొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
అయితే నిన్న ఘటన జరిగినప్పటి నుంచి మరో మెడికో కనబడకుండా పోయారని అధికారులు ప్రకటించారు. 24 గంటలుగా ఆ విద్యార్థి ఆచూకీ లేదని, శిథిలాల కింద మరోసారి గాలిస్తామని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మెడీకోలతోసహ ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు.






