- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్-భారత్ ట్రేడ్ డీల్‌లో పురోగతి
యూఎస్-భారత్ ట్రేడ్ డీల్‌లో పురోగతి వచ్చిందని పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నాయన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-యూఎస్ మధ్య ట్రేడ్ చర్చలు పురోగతి సాధించాయని, అడ్వాన్స్ స్టేజీకి చేరాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య హద్దులను సరళీకరించే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ డిప్యూటీ ట్రేడ్ రిప్రజంటేటివ్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని ఒక బృందం ఇటీవలే భారత్‌కు వచ్చి చర్చలు జరిపింది. రెండ్రోజుల చర్చల తర్వాత డిసెంబరు 11న ఆ బృందం యూఎస్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గోయల్ మాట్లాడుతూ.. యూఎస్‌తో చర్చలు అడ్వాన్స్ దశకు చేరాయని ప్రకటించారు. భారత్-న్యూజిల్యాండ్ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించిన ఆయన.. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఫైవ్ ఐస్ (ఎఫ్‌వీఈవై) ఇంటెలిజెన్స్ కూటమిలో భాగస్వాములైన ఐదు దేశాల్లో మూడింటితో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని ఈ సందర్భంగా గోయల్ వెల్లడించారు. ఈ కూటమిలో ఉన్న ఆస్ట్రేలియా, యూకే, న్యూజిల్యాండ్‌తో భారత్ ఒప్పందాలు చేసుకోగా.. యూఎస్‌తో చర్చలు జరుగుతున్నాయి. ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు కెనడాతో సంబంధాలు దెబ్బతినండంతో ఆగిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు కూడా భారత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు గోయల్ చెప్పారు.






