- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Piyush Goyal: దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ట్రంప్ టారిఫ్‌పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ట్రంప్ టారిఫ్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush goyal) స్పందించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమెరికా సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నామని, జాతీయ ప్రయోజనాలకు కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్ సభలో మాట్లాడారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎగుమతిదారులు, పరిశ్రమలు సహా ఇతర వాటాదారులతో సంప్రదిస్తుందని తెలిపారు. రైతులు, కార్మికులు, వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈ, పారిశ్రామిక రంగ వాటాదారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ ఏడాది ఏప్రిల్ 2న పరస్పర సుంకాలపై కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5 నుంచి 10 శాతం బేస్‌లైన్ సుంకం అమల్లోకి వచ్చిందని, దీనితో కలిసి భారత్‌కు మొత్తం 26 శాతం సుంకం ప్రకటించినట్టు తెలిపారు. అదనపు సుంకం ఏప్రిల్ 9 2025 నుండి అమల్లోకి రావాల్సి ఉండగా ఆగస్టు 1 వరకు పొడిగించినట్టు గుర్తు చేశారు.






