భారత్-యూకే డీల్ ‘గోల్డ్ స్టాండర్డ్’.. భారత్‌లో 6 యూకే వర్సిటీల క్యాంపస్‌లు!

by Phanindra |

భారత్-యూకే డీల్ ‘గోల్డ్ స్టాండర్డ్’ ఒప్పందం అని, ఈ ఒప్పందం కింద 6 యూకే వర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు చేస్తాయని చెప్పారు.

భారత్-యూకే డీల్ ‘గోల్డ్ స్టాండర్డ్’.. భారత్‌లో 6 యూకే వర్సిటీల క్యాంపస్‌లు!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు చెందిన సున్నితమైన, శ్రమతో కూడిన రంగాలను కాపాడుకునే విధంగా యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇది వాణిజ్య ఒప్పందాల్లోనే ‘గోల్డ్ స్టాండర్డ్’ అని కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతకు ఈ ఒప్పందం అద్దం పడుతుందని చెప్పిన ఆయన.. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, భారత్‌కు సాధ్యమైనంత లాభం దక్కేలా ఈ ఒప్పందం చేసుకున్నామని అన్నారు.

అలాగే ఎక్కువ మంది శ్రామికులు అవసరమయ్యే డెయిరీ, బియ్యం, చక్కెర తదితర రంగాల్లోకి బ్రిటిష్ కంపెనీలు వచ్చేందుకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. త్వరలోనే యూకేకు చెందిన ఆరు యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తాయని గోయల్ ప్రకటించారు. భారత్-యూకే డీల్‌లో 30 అధ్యాయాలున్నాయని, మరే ఒప్పందంలో ఇన్ని చాప్టర్లు ఉన్నట్లు తనకు గుర్తులేదని అన్నారు. ఈ డీల్‌కు భారత కేబినెట్ ఆమోదం కూడా లభించింది. బ్రిటిష్ పార్లమెంటులో కూడా త్వరలోనే దీన్ని ప్రవేశపెడతారని సమాచారం.

Next Story