- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Horrific Incident: వీధి కుక్కను కరిచి కరిచి చంపిన పిట్ బుల్ డాగ్..చూస్తూనే ఉన్న లేడీ యజమాని (Video Viral)
Horrific Incident: వీధి కుక్కను కరిచి కరిచి చంపిన పిట్ బుల్ డాగ్..చూస్తూనే ఉన్న లేడీ యజమాని (Video Viral)
వీధికుక్కను పిట్ బుల్ డాగ్ చంపుతున్నా చూస్తూనే ఉన్న లేడీ యజమానిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఔరంగాబాద్ చేతనానగర్(Maharrastra Aurangabad Chetananagar)లో జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్ అందరిని కలచివేసింది. పిల్లలకు పాలిచ్చే వీధికుక్కపై పిట్ బుల్ డాగ్(Pitbull ) దాడి చేసింది. లేడీ యజమాని ఎదురుగా ఉండగానే వీధికుక్క(Dog)ను విచక్షణా రహితంగా కరిచి కరిచి చంపింది. వీధి కుక్కను చంపుతుంటే మహిళా యజమానురాలు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదంతా స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పిట్ బుల్ డాగ్ యజమానిపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలిచ్చే వీధికుక్కపై ఇంత క్రూరత్వం జరుగుతున్నా మహిళ అయి ఉండి కూడా వేడుక చూస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. పిట్ బుల్ డాగ్ యజమానులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






