- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా ప్రమాద ఘటన.. మరో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు పైలట్ తండ్రి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 272 మంది మరణించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన (Air India flight accident) ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 272 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ భారత దేశంతో పాటు ప్రపంచం మొత్తం షాక్‌కు గురైంది. కాగా ఈ ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో, మరికొన్ని సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనకు పైలట్ల నిర్లక్ష్యమే కారణమై ఉంటుందని గతంలో ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో ఎయిరిండియా ఫ్లైట్ ప్రమాదానికి ముందు పైలట్ల సంభాషణలను విడుదల చేసింది. దీనిపై పైలట్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఈ ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు పారదర్శకంగా లేదని (Captain Sumit Sabharwal) కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ (Supreme Court) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనపై పైలట్లను బాధ్యులను చేయడం సరికాదని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు కోరుతూ గురువారం సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. గత ఏడాది జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాద ఘటనలో పైలట్ సుమీత్ ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో విచారణలో పైలట్ల తప్పిదం ఉన్నట్లు నిర్ధారించడంపై పైలట్ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రమాద ఘటనపై న్యాయమైన, పారదర్శకమైన, సాంకేతికంగా పటిష్టమైన దర్యాప్తును నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర విమానయాన, సాంకేతిక నిపుణులను సభ్యులుగా ఒక విచారణ కమిటీ లేదా విచారణ కోర్టుని ఏర్పాటు చేయాలని కోరారు.






