- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద (Ahmedabad Air India flight crash) నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద (Ahmedabad Air India flight crash) నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల విడుదలైన ప్రాథమిక నివేదికపై 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్' తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదికలో వెల్లడించిన అంశాలు పలు అనుమానాలకు తావిస్తోందని, విమాన ప్రమాణాలను విచారణ కమిటీ ఒకపక్కగా మాత్రమే పరిశీలించిందని విమర్శించింది. ముఖ్యంగా పైలట్ల వైఖరి గురించి తేలికపాటి వ్యాఖ్యలు చేయడం, వ్యవస్థాగత లోపాలను లైట్‌గా తీసుకోవడం పట్ల సంఘం అసహనం వ్యక్తం చేసింది. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా పరిశీలించకుండా కొంత మందిపై ఆరోపణలు మోపడం అన్యాయం అని పేర్కొంది.
విచారణ కమిటీలో పైలట్లకు అవకాశం ఇవ్వకపోవడాన్ని సంఘం తీవ్రంగా ఖండించింది. పైలట్ల సంఘాన్ని విచారణలో భాగంగా చేర్చకపోవడం న్యాయ పరిధిని దాటిన చర్యగా పేర్కొంది. పైలట్లతో సంప్రదింపులు లేకుండా నివేదిక రూపొందించడం, అలాగే ప్రాథమిక నివేదికను బహిరంగంగా విడుదల చేయడం వల్ల ప్రజల్లో అపోహలు కలుగుతాయని అభిప్రాయపడింది. ఈ చర్యల వల్ల పైలట్ల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, భవిష్యత్ విమాన భద్రతకూ ఇది హానికరమని పేర్కొంది. నిష్పక్షపాత విచారణ కోసం సంఘాన్ని చర్చల్లో భాగంగా చేర్చాలని కోరుతూ విమానయాన సంస్థలకు, ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసింది.






