Air India Crash: ఏఏఐబీ రిపోర్టుపై పైలట్ అసోసియేషన్ అసంతృప్తి

by Phanindra |

ఏఏఐబీ రిపోర్టుపై పైలట్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చనిపోయిన పైలట్లపై వివక్ష చూపిస్తోందని అభిప్రాయపడింది.

Air India Crash: ఏఏఐబీ రిపోర్టుపై పైలట్ అసోసియేషన్ అసంతృప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన రిపోర్టుపై ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌పీఏ-ఆల్పా) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ రిపోర్టులో పైలట్ల మధ్య జరిగిన చిన్న సంభాషణ బయటకు రావడంతో అందరూ పైలట్ల వల్లనే ప్రమాదం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. పైలట్ల వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు రిపోర్టులో అంచనా వేసినట్లు కనిపిస్తోందని ఆల్పా పేర్కొంది. ‘ఈ రిపోర్టు వెళ్తున్న మార్గం, టోన్ చూస్తుంటే పైలట్లపై వివక్ష చూపించినట్లు కనిపిస్తోంది. మేం ఇలాంటి ఊహాగానాలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో నిజాయితీగా, వాస్తవాధారిత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆల్పా తెలిపింది.

Next Story