ఇంటికి పిలిచి ఎయిర్ హోస్టెస్‌‌పై పైలట్ అఘాయిత్యం

by Yella Dhawani Reddy |

మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న మీరా రోడ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది.

ఇంటికి పిలిచి ఎయిర్ హోస్టెస్‌‌పై పైలట్ అఘాయిత్యం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న మీరా రోడ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేస్తున్న పైలట్ తన సహోద్యోగినైన 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తనకు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. వారం రోజుల కిందట లండన్‌ నుంచి తిరిగి ముంబైకి విమాన సర్వీసు ముగించుకున్న తర్వాత మీరా రోడ్‌లోని తమ నివాసాలకు కలిసి వెళ్లారు.

ఈ సందర్భంగా పైలట్ తన ఇంటికి రావాలని ఆమెను ఆహ్వానించాడు. మొదట్లో మామూలుగానే భావించిన ఆమె, అతని ఇంటికి వెళ్లింది. అయితే, ఇంట్లో ఎవరు లేరని, ఈ సమయంలోనే పైలట్ ఆమెపై అత్యాచారం చేశాడని ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పైలట్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

Next Story