- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వణికిస్తోన్న భారీ వరదలు.. కైలాస్‌యాత్ర మార్గంలో చిక్కుకున్న యాత్రికులు
ఉత్తర భారతాన్ని భారీ వరదలు వణికిస్తున్నాయి. నిన్న ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో సంభవించిన ఆకస్మిక వరదలకు ధరాలీ గ్రామమంతా తుడిచి పెట్టుకుపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర భారతాన్ని భారీ వరదలు వణికిస్తున్నాయి. నిన్న ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో సంభవించిన ఆకస్మిక వరదలకు ధరాలీ గ్రామమంతా తుడిచి పెట్టుకుపోయింది. వర్షపాతం తక్కువగానే నమోదైనా.. అంతవరద రావడానికి కారణమేంటన్న దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. హిమపాతం జరిగిందా అన్న విషయం తెలుసుకునేందుకు శాటిలైట్ ఫొటోలను పరిశీలిస్తున్నారు. కాగా.. బుధవారం కురిసిన వర్షానికి ధరాలీ గ్రామం పూర్తిగా నీటమునిగింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కైలాస్ యాత్ర మార్గంలో యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వరదల కారణంగా ట్రెక్కింగ్ మార్గాలు కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే.. ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికుల్ని రక్షించారు.
Next Story






