- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pig Farming: తొక్కలో ఉద్యోగం... పందుల పెంపకం బెస్ట్.. ఫ్రూఫ్ ఈ స్టోరీనే
Pig Farming: విమానయాన సంస్థలో మంచి ఉద్యోగం. మంచి జీతం. అయినా కూడా ఆ ఉద్యోగం వద్దనుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : Pig Farming: విమానయాన సంస్థలో మంచి ఉద్యోగం. మంచి జీతం. అయినా కూడా ఆ ఉద్యోగం వద్దనుకుంది. మరో క్రేజీ కెరీర్ ను ఎంచుకుంది. కెరీర్ లో ఆమె తన జీతానికి రెట్టింపు ఆదాయం పొందుతూ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.
చైనాలో మాజీ ఫ్లైట్ అటెండెంట్ అయిన యాంగ్ యాంగ్ యాంగ్సీ..తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. సొంతవూరుకు వెళ్లిపోయింది. తన ఊరిలోనూ ఉంటూ పందుల పెంపంకందారునిగా మారాలని డిసైడ్ అయ్యింది. పందుల పెంపకాన్ని కెరీర్ గా ఎంచుకున్న తర్వాత కేవలం రెండు నెలల్లో ఆమే 200,000యువాన్లు సంపాదించింది.
27ఏళ్ల యాంగ్ ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్ లో ఒక గ్రామీణ కుటుంబంలో పుట్టి పెరిగింది. యూనివర్సిటీ చదువు పూర్తయిన తర్వాత షాంఘైకి చెందిన ఓ ఎయిర్ లైన్స్ లో ఐదేళ్లపాటు ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేశారు. విమానయాన సంస్థ కష్టకాలంలో తన నెల జీతం కేవలం 2,800 యువాన్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 22,39,650 )మాత్రమే అని తెలిపింది. షాంఘైలో నివనిస్తున్నప్పుడు తన పేరెంట్స్ ను తరచుగా డబ్బు అడిగేదానిని ఆమె తెలిపింది. అయితే తనను పోషించేందుకు తన తల్లిదండ్రులు తమ సొంత ఖర్చులను తగ్గించుకుంటున్నారని అంతేకాకుండా అప్పులు చేస్తున్నారని తర్వాత గ్రహించినట్లు తెలిపింది.
2022 అక్టోబర్ లో లిపోమాస్ ను తొలగించేందుకు తన తల్లికి పలు శస్త్రచికిత్సలు జరిగినట్లు తెలుసుకున్న తర్వాత యాంగ్ ఫ్లై అటెండెంట్ ఉద్యోగాన్ని వదిలి తన సొంతూరుకు తిరిగి రావాలని డిసైడ్ అయ్యింది. నా తల్లిదండ్రులు ఎలప్పుడూ నాకు మంచి విషయాలు చెబుతారు. చెడు దాచారు. ఇప్పుడు నేను వారితోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది.
2023 ఏప్రిల్ లో యాంగ్ బంధువులకు చెందిన ఒక పందుల ఫారంను లీజ్ కు తీసుకుంది. పందుల పెంపంతోపాటు ఇతర పుశువులను విక్రయించడం తన సోషల్ మీడియాను నిర్వహించడం ద్వారా 27,000అమెరికన్ డాలర్లు సంపాదించానని యాంగ్ తెలిపారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలని ఒక ప్రత్యేక దుకాణాన్ని తెరవాలని చివరికి ఒక హోటల్ ప్రారంభించాలని ఆమె అనుకుంటున్నట్లు తెలిపింది.
- Tags
- Pig Farming
- china






