Amarnath Yatra: పవిత్ర అమర్‌నాథ్ గుహలో 'మంచు శివలింగం' ఫోటోలు వచ్చేశాయ్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు

by Ramesh Naini |

ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అమర్‌నాథ్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మంచుతో ఏర్పడిన శివలింగం..

Amarnath Yatra: పవిత్ర అమర్‌నాథ్ గుహలో మంచు శివలింగం ఫోటోలు వచ్చేశాయ్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది (Amarnath Yatra 2025) అమర్‌నాథ్ యాత్రకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అమర్‌నాథ్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మంచుతో ఏర్పడిన శివలింగం.. యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంచుతో ఏర్పడిన శివలింగం భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలోనే పవిత్ర అమర్‌నాథ్ గుహలో 'బాబా బర్ఫానీ' (baba barfani) వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇది సుమారు 7 అడుగుల ఎత్తులో ఉంది. ఈ తీర్థయాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భక్తులకు మంచుతో ఏర్పడిన శివలింగం చూడటంతో మరింత ఉత్సాహం నింపింది. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రల్లో అమర్‌నాథ్ యాత్ర ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది శివ భక్తులు ఈ యాత్రకు వస్తుంటారు.

జమ్మూ కాశ్మీర్‌లోని (Anantnag) అనంతనాగ్ జిల్లాలో పవిత్ర అమర్‌నాథ్ గుహను శివుని నివాసంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక, అమరనాథ్ యాత్ర ఈ సంవత్సరం జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఆగస్టు రక్షా బంధన్ పండుగతో ఈ యాత్ర ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ తీర్థయాత్ర దాదాపు 38 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంచుతో కప్పబడిన మార్గాలను క్లియర్ చేయడానికి అధికారులు అవిశ్రాంత కృషి చేస్తున్నారు. రెండు ప్రధాన మార్గాలైన బాల్టాల్, చందన్‌వారీలలో మంచు తొలగింపు పనులు ప్రారంభించారు. ఈ యాత్ర కోసం ఇప్పటికే 3,60,000 మందికి వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. యాత్ర తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story