Thailand: పక్క దేశం నేతతో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. బ్యూటీఫుల్ లేడీ పీఎం పోస్టు ఊస్ట్

by Prasad Jukanti |

ఒక్క ఫోన్ కాల్ దెబ్బకు ప్రధాన మంత్రి పదవి పోయింది.

Thailand:  పక్క దేశం నేతతో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. బ్యూటీఫుల్ లేడీ  పీఎం పోస్టు ఊస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ మాత్రం నిర్లక్ష్యం, అజాగ్రత్త వహించినా ప్రత్యర్థుల పాచికలకు పావుకా మారాల్సిందే. తాజాగా థాయ్ లాండ్ (Thailand) ప్రధాన మంత్రి పాయ్ టోంగ్ టార్న్ షినవత్ర (39) (Shinawatra) విషయంలో అచ్చం ఇదే జరిగింది. తమ పొరుగు దేశం కాంబోడియా నేతతో ఆమె జరిపిన ఒక్క ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు ఆమె ప్రధాన మంత్రి పదవికి ఎసరు పెట్టింది. ఈ ఫోన్ కాల్ విషయంలో గతంలోనే ఆమెపై విమర్శలు రాగా తాజాగా ఆమెను పదవి నుంచి తొలగిస్తూ థాయ్ లాండ్ రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు చెప్పింది. జులై 2న ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేయగా అభియోగాలు రుజువు కావడంతో ఇప్పుడు పదవి నుంచి తొలగిస్తూ తూర్పు వెల్లడించింది.

అసలేం జరిగింది?:

థాయ్ లాండ్ సంపన్నుడు మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తే పాయ్‌టోంగ్‌టార్న్‌ షినవత్ర గతేడాది ఆగస్టులో ఆ దేశ ప్రధాని పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళాగా రికార్డు నెలకొల్పారు. అందం, ఫ్యాషన్స్ లోనూ స్టైల్ ఐకాన్ గా, బ్యూటీఫుల్ పీఎంగా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆదరణ పొందుతున్న ఆమె ఈ ఏడాది మే లో పోరుగు దేశం కంబోడియా-థాయ్ లాంట్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ కి షినవత్రా ఫోన్ చేశారు. ‘అంకుల్’ అంటూ హున్ సేన్ ను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. అలాగే థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్ సిన్ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఆమె ఆయనతో చెప్పారు. జూన్ లో ఈ ఫోన్ కాల్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. అది కాస్తా రాజకీయ దుమారం రేపింది. దాంతో ఈ విషయంలో షీనవత్రా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయినా రాజకీయ విమర్శలు తగ్గలేదు. ఆమె దేశ భద్రతకు సంబంధించిన విషయాలు శత్రుదేశంతో పంచుకున్నారని ఆమెపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఆమెను అక్కడి కోర్టు సస్పెండ్ చేయగా తాజాగా పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్ కనసాగుతున్నారు. షీనవత్ర పదవి ఊస్ట్ కావడంతో ఆమె స్థానంలో కొత్త ప్రధాని ఎవరు రాబోతున్నాదనేది ఉత్కంఠగా మారింది.

Next Story