- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phensedyl: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కలకలం.. 62,200 ఫెన్సిడిల్ బాటిళ్ల స్వాధీనం
భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ 62,200 ఫెన్సిడిల్ దగ్గు బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) 62,200 ఫెన్సిడిల్ దగ్గు బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇండో-బంగ్లా సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని నాడియా జిల్లాలో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా ఫెన్సిడిల్ బాటిళ్లను గుర్తించి సీజ్ చేశారు. అండర్ గ్రౌండ్ స్టోరేజీ ట్యాంకుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మూడు ట్యాంకుల్లో బాటిళ్లను నిల్వ చేసినట్టు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ. 1.4కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో స్మగ్లర్ల నెట్‌వర్క్ పూర్తిగా కుదేలైందని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఫెన్సిడిల్‌ను బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా రవాణా చేసినట్టు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఫిన్‌సెడైల్‌ను తదుపరి చట్టపరమైన చర్యల కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. స్మగ్లర్ల సంక్లిష్ట నెట్‌వర్క్‌పై మరింత సమాచారం సేకరిస్తున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది.






