భారత్‌లో 7.2 శాతం పెరిగిన ఔషధ విక్రయాలు

by Yella Dhawani Reddy |

భారత్‌ ఔషధ మార్కెట్‌ వృద్ధి పుంజుకుంది.

భారత్‌లో 7.2 శాతం పెరిగిన ఔషధ విక్రయాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఔషధ మార్కెట్‌ వృద్ధి పుంజుకుంది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే నెల మధ్య కాలంలో దేశీయ ఫార్మా పరిశ్రమ దాదాపు రూ.2.29 లక్షల కోట్ల విలువైన మందుల అమ్మకాలు సాధించింది. అంతకు ముందు ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత అమ్మకాల్లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫార్మారాక్ నివేదిక ప్రకారం, ఒక్క మే నెలలోనే మొత్తం విక్రయాలు రూ.19,720 కోట్ల మందుల అమ్మకాలు నమోదయ్యాయి. అయితే, మందుల అమ్మకాలు సంఖ్య పరంగా (వాల్యూమ్) పెద్దగా పెరగకపోయినా, వాటి ధరలు పెరగడం వల్ల మొత్తం అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. అంతేకాదు, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన మందులూ ఈ వృద్ధికి సహాయపడాయి.

దీర్ఘకాలిక చికిత్సల మందులదే ఆధిక్యం

ఇక ఈ వృద్ధికి ముఖ్య కారణం దీర్ఘకాలిక చికిత్సలకు ఉపయోగించే మందుల అమ్మకాలే. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు (కార్డియాక్), మధుమేహం (డయాబెటిస్), అంటువ్యాధుల (ఇన్ఫెక్షన్లు) మందులు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఈ విభాగాల్లో 7%కి పైగా వృద్ధి నమోదైంది. అంటే, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడం, నిరంతరం మందులు వాడాల్సిన అవసరం ఉండడం ఈ వృద్ధికి దారితీసాయి.

జీఎస్కే సంస్థకు చెందిన ప్రఖ్యాత బ్రాండ్‌ ఆగ్‌మెంటిన్‌ (Augmentin) మే నెలలో 12వ స్థానానికి పడిపోవడం గమనార్హం. కాగా, సన్‌ ఫార్మా (Sun Pharma), డాక్టర్‌ రెడ్డీస్ (Dr. Reddy’s), యూఎస్వీ వంటి సంస్థలు తమ బ్రాండ్‌లు మద్దతుతో టాప్ లిస్టులో నిలిచాయి. తాజా గణాంకాలు చూస్తే, ఔషధ పరిశ్రమలో కొత్త లాంచ్‌లు, ధరల పెరుగుదల, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ అవసరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది పరిశ్రమ భవిష్యత్తుకు బలమైన సంకేతంగా నిలుస్తోంది.

Next Story