- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్
వ్యాక్సిన్లు అత్యవసర వాడకం కోసం మార్కెట్లోకి వేగంగా వచ్చేశాయి. సాధారణంగా అమెరికాలో 10 నుంచి 15 ఏళ్ల పాటు వీటిపై పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది.

- మహిళల్లో పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం
- వేగవంతమైన అనుమతుల వల్లే ఇలాంటి నష్టం
- అమెరికా జర్నలిస్టు డాక్టర్ నయోమీ వుల్ఫ్
దిశ, నేషనల్ బ్యూరో: ఫైజర్ కంపెనీకి చెందిన ఎంఆర్ఎన్ఏ కోవిడ్-19 వ్యాక్సిన్ మహిళలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపెట్టింది. వేగవంతమైన అనుమతల కారణంగా మహిళల పునరుత్పత్తి, బహిష్ణుపై ప్రభావం పడింది. వ్యాక్సిన్ల అభివృద్ధి, పరీక్ష, అనుమతుల విషయంపై డాక్టర్ నయోమీ వుల్ఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. 'ఫైజర్ పేపర్స్' పేరుతో తన పరిశోధనా పత్రాలను ప్రచురించిన అమెరికా రచయిత్రి, జర్నలిస్టు డాక్టర్ నయోమీ తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్‌లో పలు విషయాలు వెల్లడించారు. డాక్టర్ వుల్ఫ్ మహిళల ఆరోగ్యంపై చాలా కాలంగా పోరాడుతున్నారు. తన పరిశోధనలో ఎం ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వల్ల రుతు క్రమరాహిత్యం, పునరుత్పత్తి సమస్యలు పెరిగినట్లు గుర్తించారు. ఇటీవల కోవిడ్-19 వ్యాక్సిన్ల కారణంగా ప్రజల ఆరోగ్యం ఎలా ప్రభావితం అయ్యిందన్న విశ్లేషణల కారణంగా ఆమె వివాదాస్పదంగా మారారు. 3,250 మంది డాక్టర్లు, సైంటిస్టులను సంప్రదించి, వారితో చర్చించిన తర్వాత 109 సమగ్రమైన నివేదికలను 'ఫైజర్ పేపర్స్'పేరుతో పబ్లిష్ చేశారు.
వ్యాక్సిన్లు అత్యవసర వాడకం కోసం మార్కెట్లోకి వేగంగా వచ్చేశాయి. సాధారణంగా అమెరికాలో 10 నుంచి 15 ఏళ్ల పాటు వీటిపై పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అత్యవసర వాడకం పేరుతో విడుదల చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని, ముఖ్యంగా మహిళల పునరుత్పత్తి వ్యవస్థను డ్యామేజ్ చేసినట్లు డాక్టర్ వుల్ఫ్ పేర్కొన్నారు. తాను కోవిడ్-19 వ్యాక్సిన్లకు వ్యతిరేకం కాదు. కానీ ఈ వ్యాక్సిన్ల కారణంగా 13 శాతం నుంచి 20 శాతం వరకు జననాల రేటు పడిపోయిందని అన్నారు. ఇది కచ్చితంగా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్ అని ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాప్తిని ఈ వ్యాక్సిన్లు సరిగా అరికట్టలేకపోయాయని, ఆ విషయంలో విఫలమయ్యాయని డాక్టర్ వుల్ఫ్ స్పష్టం చేశారు.
భారతీయ వ్యాక్సిన్లు కాస్త భిన్నంగా పని చేసి ఉండొచ్చు. వీటిపై పరిశోధన చేయడానికి తమ బృందం సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు. ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి విత్ డ్రా చేశారు. కఠినమైన భద్రతా చర్యలు ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తుందని డాక్టర నయోమీ వుల్ఫ్ అన్నారు. ఎంఆర్ఎన్ఏ ఇంజక్షన్ తయారీలో పెద్ద పెట్టుబడిదారుడు బిల్ గేట్స్ అని చెప్పారు. ఈ వ్యాక్సిన్లపై సందేహాలు వచ్చినప్పుడు.. మిలియన్ల కొద్దీ డాలర్లను మీడియాకు వెదజల్లి ఆ రూమర్లను కట్టడి చేయించారని ఆమె ఆరోపించారు.
Read More ....
Costly Fruits: ఈ పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.. ధర తెలిస్తే షాక్ అవుతారు!






