BIG BREAKING: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

by velandi.Saikiran |   (  Updated:2026-05-25 01:02:00  IST  )

భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి.

BIG BREAKING: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ‌, వెబ్ డెస్క్: వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ. 2.84, అటు డీజిల్ పై రూ. 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఈ క్ర‌మంలో గ‌డిచిన 15 రోజుల వ్య‌వ‌ధిలోనే ఇప్ప‌టికే నాలుగు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తికాగానే, బాదుడు చేసిందని మోడీ సర్కార్ పై జనాలు విమర్శలు చేస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19 కాగా డీజిల్ రేటు రూ.104.88కి చేరుకుంది. హైద‌రాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.68కు చేర‌నుండ‌గా, డీజిల్ రేటు రూ. 103.74కు చేరుకుంటుంది.

Next Story