- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు బిగ్ షాక్..మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్ షాక్..దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: వాహనదారులకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెట్రోల్ పై 87 పైసలు పెరగగా, డీజిల్ పై 91 పైసలు పెంచారు. ఈ పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో రెండు వారాల వ్యవధిలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లు అయింది. ఈ క్రమంలో వాహనదారులు ఉలిక్కిపడుతున్నారు. పదే పదే ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. దీంతో ఈ భారం మొత్తం ఇంధన కంపెనీలపై పడుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియాలో కూడా చమురు ధరలు మూడోసారి పెరిగాయి. కాగా ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్ మహా నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.71 కానుంది. డీజిల్ ధర రూ. 100.86కు చేరుకోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.64 చేరుకోనుండగా.. డీజిల్ ధర రూ. 91.58 కానుంది.






