Maha Kumbh Mela : మ‌హా కుంభ‌మేళాలో తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-30 16:24:01  IST  )

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌(Uttar Pradesh Prayagraj)లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళా(Maha Kumbh Mela)లో మౌని అమవాస్య సందర్భంగా బుధ‌వారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటన(Stampede Incident)పై సుప్రీం కోర్టులో పిటిషన్(Petition in the Supreme Court)దాఖలైంది.

Maha Kumbh Mela : మ‌హా కుంభ‌మేళాలో తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌(Uttar Pradesh Prayagraj)లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళా(Maha Kumbh Mela)లో మౌని అమవాస్య సందర్భంగా బుధ‌వారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటన(Stampede Incident)పై సుప్రీం కోర్టులో పిటిషన్(Petition in the Supreme Court)దాఖలైంది. మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది మంది భ‌క్తులు ఒకేసారి త్రివేణి సంగమం ఘాట్ లోకి చొచ్చుకరావడంతో చోటుచేసుకున్న తొక్కిస‌లాట‌లో 30 మంది ప్రాణాలు కోల్పోగా..మరో 60మంది గాయపడ్డారు.

ఈ దుర్ఘటనపై యూపీలోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ తాజాగా దేశ అత్యున్నత న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయింది. విశాల్ తివారీ అనే న్యాయ‌వాది(Lawyer Vishal Tiwari)ఈ పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా రాష్ట్రాల‌కు స్పష్టమైన, విధాన‌ప‌ర‌మైన మార్గదర్శకాలు ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. భ‌క్తుల భ‌ద్రత‌ ప్రమాదంలో ప‌డ‌కుండా నివారించేలా వీఐపీల అనుమతులను ఆపాల‌ని పిటిషన్ కోరారు. తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖలైన నేప‌థ్యంలో ఘ‌ట‌న‌పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్టేట‌స్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంది.

మరోవైపు మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం జస్టీస్ కృష్ణ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 15 రోజుల్లో రిపోర్టు సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పష్టం చేశారు. అలాగే.. తొక్కి సలాటలో మృతి చెందిన కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‎గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. గాయపడిన వారి వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.

మహాకుంభంలో తొక్కిసలాట ప్రమాదం తరువాత, అధికారులు భద్రతను మెరుగుపర్చడానికి కొన్ని మార్పులు చేశారు. ఇప్పటికే భారీ భక్తుల రద్దీ కారణంగా జోన్, వన్-వే మార్గాలు, వాహనాల ప్రవేశం నిషేధం..ట్రాఫిక్ నియంత్రణ, వీవీఐపీలకు పాసుల రద్దు వంటి చర్యలు చేపట్టారు. తొక్కిసలాట (Stampede) జరిగిన ప్రాంతాన్ని ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ మనోజ్‌కుమార్‌ సింగ్‌ (Manoj Kumar Singh), డీజీపీ ప్రశాంత్‌ కుమార్ (Prashant Kumar) పరిశీలించారు. ప్రమాదంపై విచారణ చేశారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, కుంభమేళ ముగింపు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి రోజున పవిత్ర స్నానాల సందర్భంగా తొక్కిసలాటలు జరుగకుండా ముందస్తు చర్యలను సమీక్షించారు.

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వ‌ర‌కు 45 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో నిన్నటి వ‌ర‌కే 27 కోట్ల మంది ప‌విత్ర స్నానాలు ఆచ‌రించిన‌ట్లు యోగి స‌ర్కార్ వెల్లడించింది. సుమారు 40కోట్ల మంది వ‌ర‌కు భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ్‌లో పాల్గొనే పౌరులకు సహాయం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్‌లను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే ప్రజలు టోల్-ఫ్రీ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా సహాయాన్ని పొందవచ్చని..1070, 8218867005, 9058441404 నంబర్లతో పాటు ఏదైనా సమస్య ఎదురైతే ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ పలు ఫోన్ నంబర్లను సూచించింది. ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ: 0532-2504011, 0532-2500775, మహా కుంభ్ వాట్సాప్ చాట్‌బాట్: 08887847135, మహా కుంభ్ అగ్నిమాపక హెల్ప్‌లైన్: 1945, మహా కుంభ్ ఫుడ్ & సప్లైస్ హెల్ప్‌లైన్ : 1010, మహా కుంభ్ హెల్ప్‌లైన్: 1920, మహా కుంభ్ అంబులెన్స్: 102, 108, తప్పిపోయిన, దొరికిన వారి కోసం హెల్ప్‌లైన్: 0532-2504011, 0532-2500775, మహా కుంభమేళా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్: 1944, మహా కుంభ విపత్తు హెల్ప్‌లైన్: 1077 నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

READ MORE ...

Maha Kumbh Mela : మహాకుంభ మేళాలో 27కోట్లు దాటిన భక్త జనం






Next Story