- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆన్లైన్ క్యాంపెయిన్లపై సీబీఐ (CBI) విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆన్లైన్ క్యాంపెయిన్లపై సీబీఐ (CBI) విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని అంత సెంటీమెంట్ (భావోద్వేగంగా) తీసుకోవద్దనీ న్యాయవాదులకు కోర్టు సూచించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసేనం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయవాది రాజేశ్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని లాయర్లు కోరగా. ‘‘ఇందులో ఎలాంటి తీవ్రమైన అత్యవసర పరిస్థితి లేదు. దీనిని తర్వాత పరిశీలిస్తాం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
అసలేమిటీ వివాదం?
మే 15న ఒక న్యాయవాదికి సంబంధించిన సీనియర్ హోదా పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వృత్తిలో ఉపాధి దొరకక బొద్దింకల (కాక్రోచెస్) లాంటి కొందరు యువకులు తయారవుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఉంటున్నారు. మరికొందరు ఆర్టీఐ (RTI) కార్యకర్తలుగా మారుతున్నారు. అని సీజేఐ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తప్పుడు అర్హతలు, నకిలీ డిగ్రీలతో వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, నిరుద్యోగ యువతను ఉద్దేశించి కాదని సీజేఐ తర్వాత స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బోస్టన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అభిజీత్ దీప్కే అనే యువకుడు ఆన్లైన్లో వ్యంగ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) అనే పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని, డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించాడు. ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ ఫామ్స్‌లో దీనికి విపీరీతమైన ఆదరణ లభించింది. ఇటీవల నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కూడా ఈ గ్రూప్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రచారం తీవ్రం చేసింది.
పిటిషనర్ వాదన ఏమిటి?
కోర్టులో న్యాయమూర్తులు సహజంగా మాట్లాడే మాటలను (Oral Observations) సందర్భం లేకుండా కత్తిరించి, మీమ్స్ (Merries) రూపంలో మలిచి, వాటి ద్వారా కొందరు వాణిజ్యపరంగా లాభపడుతున్నారని న్యాయవాది రాజేశ్ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్యాంపెయిన్ వెనుక ఉన్న నకిలీ న్యాయవాదులు, నకిలీ డిగ్రీల హోల్డర్లపై సీబీఐ విచారణ జరపాలని ఆయన కోరారు. మరో న్యాయవాది ఎన్.కె. గోస్వామి వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రచారం న్యాయవ్యవస్థ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనే స్పందించిన ధర్మాసనం.. ఈ విషయాన్నీ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇటీవల భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఎక్స్ (X) ఖాతాను నిలిపివేయగా, వెంటనే 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరుతో మరో ఖాతా తెరిచారు. ఈ ఖాతాల నిలిపివేతపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. యువత భావోద్వేగాలను, ఆందోళనలను గౌరవించే ప్రభుత్వం కావాలని, ఇలాంటి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అవి మరింత బలంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతానికి ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్కు సుప్రీంకోర్టులో తక్షణ ఉపశమనం లభించలేదు.






