'గృహ జ్యోతి' స్కీంపై సీఎం కీలక ప్రకటన..

by Disha Web Desk 13 |
గృహ జ్యోతి స్కీంపై సీఎం కీలక ప్రకటన..
X

బెంగళూరు: "గృహజ్యోతి" స్కీం పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. జులై 1 నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రతి నెలా 200 యూనిట్ల విద్యుత్ ను ఫ్రీగా అందిస్తామని తెలిపారు. అయితే వినియోగదారులు ఏరియర్స్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరెంట్ బిల్స్ బకాయిలు అన్నీ ఈ నెలాఖరులోగా కట్టేయాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 5 హామీలు అన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాలని శుక్రవారం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో డిసైడ్ చేశామని ప్రకటించారు.

కాంగ్రెస్ సర్కారు కర్ణాటకలో అమలు చేయనున్న మిగితా స్కీమ్స్ విషయానికి వస్తే.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి 10 కేజీలు చొప్పున ప్రతినెలా బియ్యం పంపిణీ చేసే స్కీం ఉంది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించే స్కీం ఉంది. యువతకు నిరుద్యోగ భృతి అందించే "యువ నిధి" స్కీం, ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ప్రతినెలా రూ.2000 అందించే గృహలక్ష్మి స్కీంను కూడా అమలు చేయనున్నారు. అయితే 5 స్కీమ్స్ ను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ. 50,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

Read more:

ఆ ఐదు హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేస్తాం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య



Next Story

Most Viewed