- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad plane crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమోషనల్ అయ్యారు. ప్రయాణికులు అలాగే సిబ్బంది సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు... వెల్లడించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. వెల్లడించారు.
ఈ ప్రమాద సంఘటనపై ( Air India Plane Crash) తెలంగాణ అలాగే ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమోషనల్ అయ్యారు సీఎం చంద్రబాబు. ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కోసం ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా.. గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ప్రమాదవశాత్తు కూలడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఈ ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.
భయానకంగా గగనయానం.. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని విమానప్రమాదాలు జరిగాయంటే?






