- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్‌లో బీజేపీ విజయంపై పవన్ షాకింగ్ కామెంట్స్
పశ్చిమబెంగాల్ ఫలితాలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన పవన్.. మార్పు, అభివృద్ధి కోసం ప్రజలు ఈ తీర్పు ఇచ్చారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ ఫలితాలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన పవన్.. మార్పు, అభివృద్ధి కోసం ప్రజలు ఈ తీర్పు ఇచ్చారన్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు, అభివృద్ధి పట్ల, పరిపాలనలో నిర్ణయాత్మక మార్పు పట్ల ప్రజల ప్రాధాన్యతను స్పష్టంగా చూపించేలా ఉన్నాయన్నారు. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు అభివృద్ధి చేసే నాయకత్వానికి తమ మద్దతు తెలపగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రజలు రాజకీయమార్పును కోరుకున్నారన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యూహాత్మక నిర్దేశంతో అమిత్ షా రాజకీయ చతురతతో బీజేపీ పశ్చిమ బెంగాల్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.
ఈ విజయానికి గాను బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలిపారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి స్పూర్తినిచ్చిన, అక్రమ చొరబాట్లు.. శాంతి భద్రతల సమస్యలు లాంటి సవాళ్లను ఎదుర్కొన్న బెంగాల్ గడ్డపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం స్థిరత్వానికి, పురోగతికి ఆశ కల్పిస్తూ భరోసాను ఇస్తోందన్నారు. అస్సాంను బీజేపీ వరుసగా మూడోసారి కైవసం చేసుకున్నందుకు, ప్రజల విశ్వాసాన్ని నిరంతర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ రెండోసారి సీఎం అవ్వబోతున్నందుకు హిమంత భిశ్వశర్మకు అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కేరళలోని యూడీఎఫ్ నాయకత్వానికి మరియు పుదుచ్చేరిలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు వారి విజయాలకు కూడా అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే తమిళనాట ఘన విజయం సాధించినందుకు టీవీకే పార్టీకి, విజయ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.






