పటేల్ 150వ జయంతి.. ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత స్వాతంత్ర్యం అనంతరం 562 దేశీయ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

పటేల్ 150వ జయంతి.. ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత స్వాతంత్ర్యం అనంతరం 562 దేశీయ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను “భారత ఐక్యత శిల్పి”గా, “ఉక్కు మనిషి”గా గౌరవిస్తారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీతో పాటు అహింసా మార్గంలో నడిచిన సర్దార్ పటేల్, దేశ నిర్మాణానికి పునాది వేసిన మహా నాయకుల్లో ఒకరు. దీంతో ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా.. “రాష్ట్రీయ ఏకతా దివస్”గా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వీడియోతో పాటు సందేశాన్ని పోస్టు చేశారు.

అందులో "పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఉక్కు మనిషికి నివాళులు అర్పిస్తోంది. భారత దేశ సమైక్యతకు చోదక శక్తిగా పటేల్ నిలిచారు. తద్వారా మన దేశ నిర్మాణాత్మక సంవత్సరాల్లో దాని విధిని రూపొందించారు. జాతీయ సమగ్రత, సుపరిపాలన, ప్రజా సేవ పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఐక్యమైన, బలమైన, స్వావలంబన భారతదేశం అనే ఆయన దార్శనికతను నిలబెట్టాలనే మా సమిష్టి సంకల్పాన్ని కూడా మేము పునరుద్ఘాటిస్తున్నాము." అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రధాని మోడీ గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద “రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Next Story