- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
chilli packets: ఆ బ్రాండ్ కారం పొడి వాడుతున్నారా? మోతాదుకు మించి పురుగుల మందు అవశేషాలు
ఆ బ్రాండ్ కారంపొడిలో మోతాదుకు మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు ఫుడ్ సేప్టీ అథారిటీ గుర్తించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యోగా గురువు రామ్ దేవ్ బాబా (Baba Ram Dev)కు చెందిన పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థ విక్రయించిన ఓ బ్యాచ్ కు చెందిన కారం పొడిలో (Red Chilli Powder) క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. దీంతో 4 టన్నుల కారంపొడి ప్యాకెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. ఏజేడీ2400012 బ్యాచ్ కు చెందిన కారం పొడి ఫుడ్ సేప్టీ నిబంధనలకు అనుగుణంగా లేదని ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తేల్చింది. కారానికి పురుగు పట్టకుండా అందులో కలిపే మందును పరిమితికి మంచి కలిపినట్లు శాంపిల్స్ పరీక్షలో ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) గుర్తించింది. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో సదరు బ్యాచ్ కు చెందిన కారం పొడిని రీకాల్ చేస్తున్నట్లు పతంజలి సీఈవో సంజీవ్ అస్థానా పేర్కొన్నారు. ఆ మిర్చి పౌడర్ స్టాక్ ను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించేందుకు మా డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించామని ఆ బ్యాచ్ కు చెందిన కారంపొడిని కొన్న వినియోగదారులు వెనక్కి ఇచ్చి డబ్బులు తీసుకోవాలని పేర్కొంటూ ప్రకటనలు సైతం ఇచ్చామని సంజివ ఆస్థానా వెల్లడించారు. కారం ప్యాకెట్లు కొన్నచోట్లే కస్టమర్లు వాటిని తిరిగి ఇచ్చి పూర్తి డబ్బులు వాపస్ తీసుకోవాలని సూచించారు.






