Bus Accident: ఘోర బస్సుప్రమాదం.. 15 మంది మృతి

by Rani Yarlagadda |
Bus Accident: ఘోర బస్సుప్రమాదం.. 15 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 15 మృతి చెందారు. ఈ ప్రమాదం ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని అల్మోరా జిల్లా (Almora District) మార్చులాలో సోమవారం ఉదయం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ (SDRF) ప్రమాదం జరిగిన మార్చులా సాల్ట్ ఏరియాకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సబ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. చాలామంది ప్రయాణికులు గాయపడ్డారని, వారందరినీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) విచారం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అవసరమైతే తీవ్రంగా గాయపడినవారిని ఎయిర్ లిఫ్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

Next Story