- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు తీపికబురు.. త్వరలో అందుబాటులోకి వందేభారత్ స్లీపర్ రైళ్లు
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు మరో తీపికబురు చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు త్వరలోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్ల (Vande Bharath Sleeper Trains)కు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఇవాళ ప్రకటించారు. అయితే, ఫస్ట్ ట్రైన్ కోల్‌కతా- గౌహతిల మధ్య నడవనుందని.. పీఎం మోడీ చేతుల మీదుగా ఆ ట్రైన్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్- అస్సాం మధ్య నడిచే ఈ వందేభారత్‌లో ఫ్లైట్ టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని తెలిపారు.
రాబోయే 20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని జనవరి 18 నుంచి 19 తేదీల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభిస్తామని అన్నారు. రైలు ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పారు. రాబోయే 2-3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతా, గౌహతి నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి 8 వేలు ఖర్చవుతోందని.. అదే వందేభారత్ స్లీపర్‌లో 3 టైర్ ఏసీలో ఫుడ్‌తో కలిపి ఒక ప్రయాణికుడికి రూ.2,300, 2 టైర్ ఏసీ రూ.3 వేలు, 1 టైర్ ఏసీలో రూ.3,600 ఛార్జీలు ఉండొచ్చని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.






