Parties: 474 రాజకీయ పార్టీల రద్దు.. ఈసీ కీలక నిర్ణయం

by B.Srinivas |

గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలపై ఎన్నికల సంఘం మరోసారి చర్యలు తీసుకుంది.

Parties: 474 రాజకీయ పార్టీల రద్దు.. ఈసీ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలపై ఎన్నికల సంఘం (Election commission) మరోసారి చర్యలు తీసుకుంది. ఈసీ వద్ద నమోదు చేసుకుని గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం సహా పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 474 రాజకీయ పార్టీ(Political party) లను జాబితా నుంచి తొలగించినట్టు శుక్రవారం ప్రకటించింది. ‘రెండో దశలో ఈ నెల 18న 474 పొలిటికల్ పార్టీలను లిస్ట్ నుంచి తీసివేశాం. ఆయా పార్టీలు గత ఆరేళ్లుగా ఎటువంటి ఎన్నికల్లోనూ కంటెస్ట్ చేయలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొంది. దీంతో రెండు నెలల్లో జాతితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల సంఖ్య 808కి చేరుకుంది.

అంతకుముందు ఆగస్టు 9న ఎలక్షన్ కమిషన్ 334 పార్టీలను రద్దు చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 2520 గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలుండగా తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గింది. వీటితో పాటు ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలున్నాయి. కాగా, ఒక పార్టీ ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఈసీ రూల్స్ ప్రకారం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు. సదరు పార్టీకి నోటీసులు జారీ చేసిన అనంతరం ఈ చర్యలు తీసుకుంటున్నది.

Next Story