- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. కేంద్రం ప్రవేశపెట్టనున్న 8 బిల్లులు ఇవే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జరిగే మొట్టమొదటి సమావేశం ఇదే కావడంతో ఈ సమావేశాలకు అత్యంత ప్రధాన్యత సంతరించుకుంది. ఈ సెషన్స్‌లో ‘ఆపరేషన్ సిందూర్’, పహల్గాం టెర్రర్ అటాక్ సహా అనేక అంశాలను సభలో లెవనెత్తేందుకు విపక్షాలు ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఆగస్టు 21 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో కేంద్రం మొత్తం 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టతుండగా.. పెండింగ్‌లో ఉన్న మరో 7 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. 8 కొత్త బిల్లులలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సవరణ) బిల్లు-2025 ఉంది. ఇది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం, 2017ని కేంద్ర చట్టంతో సమన్వయం చేసేందుకు బిల్లో సవరణలు చేయనున్నారు.
అదేవిధంగా టాక్సేషన్ లాస్ (సవరణ) బిల్లు-2025, ప్రస్తుత పన్ను చట్టాల్లో మార్పులు ప్రతిపాదిస్తూ ఈ బిల్లును సభ ముందకు తీసుకురానున్నారు. అదేవిధంగా జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు- 2025, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి నిబంధనల భారాన్ని తగ్గించే లక్ష్యంగా ఈ బిల్లు రానుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు- 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చట్టం- 2017 ప్రకారం షెడ్యూల్‌లో ఐఐఎం గౌహతిని చేర్చేందుకు ఈ బిల్లుతో పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్నారు. జియోహెరిటేజ్ సైట్స్ అండ్ జియో-రెలిక్స్ (సంరక్షణ, నిర్వహణ) బిల్లు-2025 ఇందులో భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన స్థలాలను పరిశోధన, విద్య, పర్యాటకం కోసం సంరక్షించడం, ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టకుని ఈ బిల్లును తీసుకొస్తున్నారు.
మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు-2025 ఇందులో కీలక ఖనిజాల రికవరీ, విస్తరించిన మైనింగ్ లీజులు, నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించేలా ఈ బిల్లును రూపొందించారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు-2025: క్రీడల ప్రోత్సాహం, క్రీడాకారుల సంక్షేమం, నీతిపరమైన పద్ధతులు, క్రీడా సమాఖ్యల గవర్నెన్స్ ప్రమాణాలు, క్రీడా ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నారు. ఇక నేషనల్ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లు-2025లో భాగంగా 2022 యాంటీ-డోపింగ్ చట్టాన్ని వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (WADA) కోడ్, గ్లోబల్ ప్రమాణాలతో సమన్వయం చేయడం, నేషనల్ యాంటీ-డోపింగ్ అప్పీల్ ప్యానెల్ స్వతంత్రంగా పనిచేయడాన్ని నిర్ధారించేందుకు బిల్లును రూపొందించారు. చివరగా ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో 1961 చట్టాన్ని భర్తీ చేసి ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకరించడం, పన్ను రేట్లు, నేరాలతో సహా చాలా నిబంధనను కఠినతరం చేసేలా పార్లమెంట్ మందుకు ఈ బిల్లు రానుంది.






