దేశానికి వ్యతిరేకంగా పోస్టులు.. వారిపై కేంద్రం చర్యలు

by Naga Rani Yarlagadda |

జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్రం చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ (Parliamentary Panel) ఆదేశించింది.

దేశానికి వ్యతిరేకంగా పోస్టులు.. వారిపై కేంద్రం చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్రం చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ (Parliamentary Panel) ఆదేశించింది. పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత కొందరు సోషల్ మీడియాలో హింసను ప్రేరేపించే పోస్టులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే (Nisikant Dubey) నేతృత్వంలోని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఐటీ స్టాండింగ్ కమిటీకి సూచించింది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చర్యలకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లను నిషేధించడంతో పాటు చట్టపరమైన చర్యలకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ, సమాచార ప్రసార మంత్రిత్వశాఖలు ఐటీ చట్టం 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నియమాలు 2021 ప్రకారం దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్న ప్లాట్ ఫారమ్ లను నిషేధించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. మే 8 లోగా దీనిపై నివేదిక అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. దీనిపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ లో చూపించనున్నారు.

Next Story