డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్షం భేటీ

by Naga Rani Yarlagadda |

డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు..

డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్షం భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు అఖిలపక్ష భేటీ జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్షాలు భేటీ కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకూ జరగనున్న శీతాకాల సమావేశాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అలాగే జాతీయగతమైన వందేమాతరంపై రేగిన వివాదం పై ఒక రోజంతా చర్చ జరపాలని డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే వందేమాతరంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలతో కేంద్రం మాట్లాడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వందేమాతరం వివాదం ఏంటంటే..

వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 7న రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ ను ఉద్దేశించి కీలక ఆరోపణలు చేశారు. జాతీయగీతంలోని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని ఆరోపించారు. ఇది దేశంలో విభజన మనస్తత్వానికి బీజాలు వేసిందని, ఇప్పటికీ దేశానికి అదొక సవాలుగానే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. తమ పార్టీ వందేమాతరాన్ని ఎంతో గౌరవించిందని, మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో కీలక చర్చ జరగనుంది.

Next Story