- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి 9న స్పీకర్ అభిశంసనపై చర్చ.. ఏప్రిల్ 2 వరకు బడ్జెట్ సెషన్
మార్చి 9న స్పీకర్ అభిశంసనపై చర్చ, ఏప్రిల్ 2 వరకు బడ్జెట్ సెషన్ రెండో షెడ్యూల్ ఉంటుంది.

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అభిశంసన తీర్మానంపై చర్చ, ఓటింగ్ మార్చి 9న జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆ రోజు నుంచే బడ్జెట్ సెషన్ రెండో షెడ్యూల్ మొదలవుతుందని వెల్లడించారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ సెషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ముఖ్యమైన కొన్ని తీర్మానాలు, కీలకమైన బిల్లులు పార్లమెంటులో చర్చకు వస్తాయని రిజిజు అన్నారు. అదే సమయంలో సభ సజావుగా సాగకుండా అడ్డుకోవడం విపక్షాలకే నష్టదాయకమని చెప్పారు. ‘మార్చి 9న స్పీకర్‌పై అభిశంసనపై చర్చ జరుగుతుంది. నిబంధనల ప్రకారం, తొలి రోజునే ఈ చర్చ జరగాలి.
అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్ జరుగుంది’ అని రిజిజు వివరించారు. అదే సమయంలో విపక్షాలు సభను అడ్డుకుంటే వారిపై కఠినమైన చర్యలుంటాయని, వారికే నష్టమని చెప్పారు. అలాగే చర్చలో విపక్షాలు పాల్గొనకపోయినా వారికే నష్టమన్నారు. అదే సమయంలో అభిశంసన తీర్మానంపై తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేయలేదని, చాలా చిన్నపార్టీలు సభను అడ్డుకోవడంపై సంతోషంగా లేవని పేర్కొన్నారు. పలురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సమస్యలను సభలో చెప్పుకోవాలని ఆ పార్టీలు అనుకుంటున్నాయని తెలియజేశారు.






