- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ్టి నుంచి పార్లమెంటు సమావేశాలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ( Parliament monsoon session) ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ( Parliament monsoon session) ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 21 రోజుల పాటు ఈ పార్లమెంట్ సెషన్ జరగనుంది. జూలై 21 అంటే ఇవాల్టి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ( Centrol Govt) నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 8 కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది కేంద్ర సర్కారు. మొత్తం 21 సెషన్లు ఈసారి జరగబోతున్న నేపథ్యంలో... ఆగస్టు 12వ తేదీ నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు పార్లమెంటుకు సెలవులు ఉండనున్నాయి. ఆ సమయంలో రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం పండుగలు వస్తున్నాయి. అందుకే ఆగస్టు 12 నుంచి 18వ తేదీ వరకు.. పార్లమెంట్ సమావేశాలకు బ్రేక్ ఉండనుంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ లిస్టు సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా... మహిళలపై దాడులు, అలాగే దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య లాంటి ఇష్యులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విపక్షాలు నిలదీయబోతున్నాయి.






