Parliament: జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

by B.Srinivas |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.

Parliament: జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ముర్ము ఆమోదించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiran rijiju) వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు 13, 14 తేదీల్లో ఉభయసభలు నడవబోవని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) అనంతరం జరిగే మొదటి పార్లమెంట్ సెషన్ ఇవే కావడం గమనార్హం. ఈ సారి ఈ సారి సమావేశాల్లో గందరగోళం ఉంటుందని భావిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే ఆపరేషన్ సిందూర్ పై చర్చించడానికి ప్రతిపక్షాలు పట్టుబట్టనున్నాయి. దీంతో ఈ సారి పార్లమెంట్ సెషన్‌పై ఆసక్తి నెలకొంది.

Next Story