- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Parliament: ఈ సమావేశాల్లోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’.. ప్రయత్నాలు మొదలు పెట్టిన కేంద్రం !
దేశ వ్యాప్తంగా మరోసారి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదన చర్చనీయాంశమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా మరోసారి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (one nation one election) ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ప్రస్తుత పార్లమెంట్ (Parliament) సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే సారి నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ బిల్లుకు మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ పలు సిఫార్సులు చేయగా కేంద్ర కేబినెట్ ఇప్పటికే దానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. బిల్లుపై సమగ్రమైన చర్చ జరిపి, ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం బిల్లును త్వరలోనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేపీసీ చర్చించనుంది. అంతేగాక అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, ఇతర ప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయనున్నారు. సాధారణ ప్రజల నుంచి కూడా దీనిపై అభిప్రాయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బిల్లులోని ప్రధాన అంశాలు, దాని ప్రయోజనాలు, దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికలను అమలు చేయడానికి కావాల్సిన పద్దుతులు వివిధ అంశాలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించనుంది. అయితే జమిలీ ఎన్నికల ఆలోచన అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అంతేగాక పలువురు సీనియర్ ప్రతినిధులు సైతం దీనిపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, దేశంలో లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. దీనిద్వారా ప్రజాధనం వృథా కాకుండా అరికట్టొచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన గతేడాది సెప్టెంబర్‌లో కమిటీని నియమించింది. ఈ ప్యానెల్ ఇటీవల తన నివేదికను రాష్ట్ర పతికి అందజేసింది. ఇందులో ప్రధానంగా ఐదు సిఫార్సులు చేసినట్టు తెలుస్తోంది.






