Parliament Budget Sessions : రేపు పునఃప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-09 16:28:37  IST  )

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) సోమవారం పునఃప్రారంభం కానున్నాయి.

Parliament Budget Sessions : రేపు పునఃప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండవ భాగం సోమవారం మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మణిపూర్‌లో తాజా హింసాకాండ, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపు, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్‌లో వాడిగా వేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఓ వైపు బడ్జెట్ పద్దులకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్‌కు, వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుండగా.. వోటర్ల జాబితాలో అక్రమాల ఆరోపణలు, మణిపూర్‌లో హింసాకాండ, ట్రంప్ ప్రభుత్వంతో భారత్ వ్యవహరణ తీరు వంటి సమస్యలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. నకిలీ ఓటరు కార్డుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఉభయ సభల్లో ఈ సమస్యను లేవనెత్తడానికి కాంగ్రెస్, డిఎంకె, శివసేన (యుబిటి) సహా ఇతర ప్రతిపక్షాల మద్దతు కోరింది టీఎంసీ.

Read Also..

తీవ్ర విషాదం.. కాళ్ల పారాణి ఆరనే లేదు.. అంతలోనే అనంతలోకాలకు నవ జంట

Next Story