రణరంగంగా మారిన పారిస్.. ఒకరు మృతి, 780 మంది అరెస్ట్

by Kema Shiva Kumar |

పారిస్‌లో ‘పీఎస్‌జీ’ విజయోత్సవాలు రణరంగంగాన్ని తలపించాయి. అభిమానుల ఘర్షణలు, అల్లర్లతో ఐఫిల్ టవర్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

రణరంగంగా మారిన పారిస్.. ఒకరు మృతి, 780 మంది అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో పీఎస్‌జీ (PSG) జట్టు ఘన విజయం సాధించిన ఆనందం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎంతోసేపు నిలవలేదు. అభిమానుల విజయోత్సవాలు కాస్తా క్షణాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. పారిస్ వీధుల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున అల్లర్లకు దిగడంతో సిటీ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ అలర్లను అదుపు చేసే క్రమంలో లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించిన 780 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎస్‌జీ విజయం తర్వాత వేలాది మంది అభిమానులు, ఆందోళనకారులు పారిస్ వీధుల్లోకి దూసుకువచ్చారు. సీన్ (Seine) నది తీరంలో ఉన్న పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు పెద్ద ఎత్తున నిప్పు పెట్టారు. అదేవిధంగా ఫుట్‌బాల్ అభిమానులు భారీ సంఖ్యలో పొగ బాంబులు, బాణసంచా కాల్చడంతో పారిస్ స్కైలైన్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రసిద్ధ ఐఫిల్ టవర్ (Eiffel Tower) సైతం ఈ పొగ కారణంగా పాక్షికంగా కనిపించకుండా పోయింది.మరోవైపు ఈ విజయోత్సవాల వేళ నగరంలో తీవ్ర కూడా చోటుచేసుకుంది. పారిస్ రింగ్ రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న ఓ పీఎస్‌జీ టీమ్ సపోర్టర్, అక్కడే ఉన్న కాంక్రీట్ బ్లాక్‌ను స్కూటర్‌తో బలంగా ఢీకొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సదరు అభిమాని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులపై దాడులు.. రికార్డు స్థాయిలో అరెస్టులు

పరిస్థితిని అదుపు చేయడానికి రంగంలోకి దిగిన భద్రతా దళాలపై అల్లరి మూకలు రాళ్లు, బాణసంచాతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. పరిస్థితి చేదాటి పోకుండా చూసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, ఉద్రిక్తతలకు కారణమైన 780 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది జరిగిన ఘర్షణల్లో 592 మందిని అరెస్ట్ చేయగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరగింది. అలర్ల వేళ ప్రారంభంలో 130 మంది అరెస్ట్ కాగా, అల్లర్లు ముదరడంతో ఆ సంఖ్య 780కి చేరింది. ప్రస్తుతం నగరంలో అదనపు బలగాలను మోహరించామని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి మీడియాకు తెలిపారు.

Next Story