Republic Day: కర్తవ్య పథ్‌లో పరేడ్ రిహార్సల్స్.. చరిత్ర సృష్టించిన భైరవ్ బెటాలియన్!

by Ramesh Naini |

దేశ రాజధానిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.

Republic Day: కర్తవ్య పథ్‌లో పరేడ్ రిహార్సల్స్.. చరిత్ర సృష్టించిన భైరవ్ బెటాలియన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. కర్తవ్య పథ్‌లో సైనిక దళాల కవాతు రిహార్సల్స్ అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

స్కౌట్ దళాల ప్రత్యేకత..

ఈ పరేడ్‌లో పాల్గొంటున్న స్కౌట్ కంటింజెంట్ గురించి కమాండర్ లెఫ్టినెంట్ అమిత్ చౌదరి మాట్లాడుతూ.. ‘అరుణాచల్, సిక్కిం, లడఖ్, గర్వాల్, డోగ్రా, కుమావూ స్కౌట్ బెటాలియన్ల ప్రతినిధులతో మా బృందం ఏర్పడింది. అత్యంత శీతల వాతావరణంలో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేయడానికి వీలుగా మేము మూడు పొరల 'ECWCS' ప్రత్యేక దుస్తులను ధరిస్తున్నాము. ఇవి మమ్మల్ని చలి నుండి రక్షిస్తాయి, అలాగే మా బూట్లు ఫ్రాస్ట్ బైట్స్ (మంచు) బారిన పడకుండా కాపాడతాయి’ అని వివరించారు.

'రైనో ఛార్జ్'తో అస్సాం రెజిమెంట్..

ఈశాన్య భారత రాష్ట్రాల సత్తాను చాటేందుకు అస్సాం రెజిమెంట్ సిద్ధమైంది. కంటింజెంట్ కమాండర్ కెప్టెన్ ఆర్యన్ మాట్లాడుతూ, తమ బృందంలో ఈశాన్య భారత '7 నార్త్ ఈస్ట్ రాష్ట్రాల' (7 Sisters) నుంచి ఎంపికైన 144 మంది సైనికులు ఉన్నారని తెలిపారు. ‘ఖడ్గమృగం (Rhino) మా చిహ్నం.. 'రైనో ఛార్జ్' మా నినాదం’ అని ఆయన గర్వంగా పేర్కొన్నారు.

చరిత్ర సృష్టించిన భైరవ్ బెటాలియన్

మరోవైపు భైరవ్ బెటాలియన్ ఈ పరేడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. బెటాలియన్ ఏర్పడిన ఏడాది కాలంలోనే రిపబ్లిక్ డే, ఆర్మీ డే పరేడ్లలో పాల్గొనే అరుదైన అవకాశం ఈ దళానికి దక్కింది. ‘ఏ రకమైన భూభాగంలోనైనా, అప్పగించిన ఏ బాధ్యతనైనా విజయవంతంగా పూర్తి చేసేలా మాకు శిక్షణ లభించింది. ఈ అవకాశం దక్కడం మాకు గర్వకారణం’ అని భైరవ్ బెటాలియన్ కమాండర్ తెలిపారు.

Next Story