Panneer selvam: ఎన్డీయేకు పన్నీర్‌ సెల్వం షాక్.. కూటమిని వీడుతున్నట్టు ప్రకటన

by B.Srinivas |

తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీఏ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించారు.

Panneer selvam: ఎన్డీయేకు పన్నీర్‌ సెల్వం షాక్.. కూటమిని వీడుతున్నట్టు ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం (Panneer selvam) (ఓపీఎస్) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమ వర్గం వైదొలగనున్నట్టు ప్రకటించారు. చెన్నయ్‌లో మార్నింగ్ వాక్ సందర్భంగా సీఎం స్టాలిన్ (Stalin) ను కలిసి వివిధ అంశాలపై చర్చించిన అనంతరం సెల్వం ఈ ప్రకటన చేశారు. పన్నీర్ సెల్వం, స్టాలిన్‌ల భేటీ ముందస్తు సమాచారం ప్రకారం జరగనప్పటికీ ఎన్డీఏను వీడనున్నట్టు ప్రకటించడం గమనార్హం. అంతకుముందు తమిళనాడులోని గంగైకొండపురంలో మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానిని కలవాలని ఓపీఎస్ విజ్ఞప్తి చేశారు. అయితే తనకు మోడీ అనుమతివ్వలేదు.

అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న పన్నీర్ సెల్వం తదనంతరం సర్వశిక్షా అభియాన్ నిధుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఈ నేపథ్యంలోనే ఎన్డీఏను వీడడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీర్ సన్నిహితుడు రామచంద్రన్ ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. ఎన్డీఏతో పొత్తును తెంచుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏ పాన్టీతోనే పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Next Story