- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, మహారాజ్‌గంజ్ నుంచి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, మహారాజ్‌గంజ్ నుంచి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు పంకజ్ చౌదరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం పూర్తయింది. ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్ తో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా ఇతర నేతలు పంకజ్ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు.
పంకజ్ చౌదరిని ఈ అత్యున్నత రాష్ట్ర పదవికి ఎంపిక చేయడం వెనుక బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం ఉంది. ఆయన ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) చెందిన కుర్మీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీలో యాదవుల తర్వాత కుర్మీలు రెండో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ నియామకం ద్వారా కీలకమైన కుర్మీ వర్గాన్ని ఆకర్షించడం తో పాటు, రానున్న ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ సంస్థాగత బలాన్ని పెంచాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 1989లోనే గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా, డిప్యూటీ మేయర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పంకజ్ చౌదరి, అత్యంత దిగువ స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు.






