లాటరీలో కలిసొచ్చిన లక్.. కోటీశ్వరుడైన డ్రైవర్

by Ajay Maddhiboyina |

లాటరీలో లక్ కలిసిరావడంతో ఓ డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. అప్పటి వరకు ఎంతో కష్టపడితే కానీ పూట గడవని ఆ కుటుంబం ఇప్పుడు గ్రామంలోనే సంపన్న కుటుంబంగా మారింది.

లాటరీలో కలిసొచ్చిన లక్.. కోటీశ్వరుడైన డ్రైవర్
X

దిశ‌, వెబ్ డెస్క్: లాటరీలో లక్ కలిసిరావడంతో ఓ డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. అప్పటి వరకు ఎంతో కష్టపడితే కానీ పూట గడవని ఆ కుటుంబం ఇప్పుడు గ్రామంలోనే సంపన్న కుటుంబంగా మారింది. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పంజాబ్ లోని లోహ్రీలో సంక్రాంతి సందర్భంగా 2026 బంపర్ లాటరీ అమ్మకాలు జరిపారు. అందులో 35ఏళ్ల పృథ్వీ సింగ్ అనే డ్రైవ‌ర్ కూడా ఓ లాట‌రీ కొనుగోలు చేశాడు. పృథ్వీ డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తుండ‌గా అత‌డి భార్య సుమ‌న్ రాణి స్కూల్ లో అటెండ‌ర్ గా ప‌నిచేస్తున్నారు.

వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కాగా పృథ్వీ కొనుగోలు చేసిన లాట‌రీలో అత‌డికి మొద‌టి బ‌హుమ‌తి రాగా ఏకంగా రూ.10 కోట్లు వ‌చ్చాయి. దీంతో అత‌డు కోటీశ్వ‌రుడు అయిపోయాడు. గ‌తంలో అత‌డు రెండు సార్లు లాట‌రీ కొనుగోలు చేయ‌గా మూడోసారి అదృష్టం వ‌రించింది. దీంతో అత‌డు సంతోషంలో మునిగిపోయాడు. గ్రామ‌స్తులు అత‌డికి స‌న్మానం చేసి అభినందించారు. కాగా లాట‌రీతో వ‌చ్చిన డ‌బ్బులు ఏం చేస్తావ‌ని పృథ్వీని ప్ర‌శ్నించగా పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం వినియోగిస్తాన‌ని చెప్పుకొచ్చాడు.

Next Story