పనామా అమెరికా ఇచ్చిన బహుమతి కాదు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-22 14:20:13  IST  )

పనామా కాలువను పరోక్షంగా చైనా నిర్వహిస్తోంది. అమెరికా దాన్ని పనామాకు ఇచ్చింది. కానీ చైనాకు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్ అన్నారు.

పనామా అమెరికా ఇచ్చిన బహుమతి కాదు
X

- కాలువ పూర్తిగా మా దేశానిదే

- ట్రంప్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

- స్పష్టం చేసిన జోస్ రౌల్ ములినో

దిశ, నేషనల్ బ్యూరో:

పనామా కాలువను అమెరికా మాకు బహుమతిగా ఏమీ ఇవ్వలేదు. ఆ కెనాల్ మాకు పూర్తిగా సొంతమని పనామా దేశ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో స్పష్టం చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొన్న ములినో ఓ ప్యానల్ మీటింగ్‌లో బుధవారం మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పనామా కాలువను తిరిగి వెనక్కు తీసుకుంటామని అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా చేసిన ప్రసంగంలో ట్రంప్ హెచ్చరించారు. పనామా కాలువను పరోక్షంగా చైనా నిర్వహిస్తోంది. అమెరికా దాన్ని పనామాకు ఇచ్చింది. కానీ చైనాకు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ములినో.. పనామా కాలువపై ట్రంప్ చేసిన ప్రతీ వ్యాఖ్య, చెప్పిన ప్రతీ మాటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ట్రంప్ చెప్పినదంతా అబద్దం. అసలు ఆ కాలువ అమెరికా నుంచి మాకు బహుమతిగా రాలేదు. అది మా దేశానికి మాత్రమే సొంతం అని ములినో స్పష్టం చేశారు. పనామా కాలువు విషయంలో చైనాకు ఎలాంటి జోక్యం లేదు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను అమెరికా తప్పుదోవ పట్టించాలని చూస్తోందని ములినో ఆరోపించారు.

పనామా కాలువను అమెరికా 1914లో నిర్మించింది. కానీ రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్ 31న దాన్ని పనామా దేశానికి అప్పగించింది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పనామా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది.

Next Story