- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
- OTT Release
- భక్తి
Congress లోకి పాన్ ఇండియా హీరో?

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా హీరో కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగుతో పాటు కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిచ్చ సుదీప్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సుదీప్ తో సమావేశమైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో సుదీప్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
శివకుమార్ బెంగళూరులోని సుదీప్ ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. కర్ణాటకలో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిక గురించి అటు సుదీప్ నుంచి గానీ ఇటు హస్తం పార్టీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా సుదీప్ ఈగ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన విక్రాంత్ రోణ తో హిట్ అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : వెండి తెరకు 'కళ' తెచ్చిన తపస్వి