- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దు- రాహుల్ గాంధీ
బిహార్ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని.. యువతకు ఉద్యోగాలివ్వలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని.. యువతకు ఉద్యోగాలివ్వలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. బెగుసరాయ్‌లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నేషనల్ ఇన్‌చార్జి కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన బిహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఇక నమ్మి మోసపోరని చెప్పుకొచ్చారు. తమ భవితవ్యాన్ని తాము రాసుకోవడానికి బిహార్ యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బిహార్‌లో నిర్వహిస్తున్న ‘వైట్ టీ-షర్ట్’ ఉద్యమంలో యువత పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లడం ఆపాలని, అందరం కలిసి రాష్ట్రంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పేపర్ లీక్‌లు మొదలైన సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్‌గాంధీ ఎక్కిడికి వెళ్లినా కాంగ్రెస్‌ను ముంచేస్తారని, బిహార్‌కు కూడా అందుకే వచ్చారని చురకలు అంటించింది. కాగా ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే బిహార్ లోని అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. బిహార్ లో ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా గెలుపొందాలని కాంగ్రెస్ నేతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది.






