- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిక్కుల్లో పలాశ్ ముచ్చల్.. అరెస్ట్ చేసేందుకు పోలీసుల గాలింపు!
ప్రముఖ సంగీత దర్శకుడు, స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్ పై అట్రాసిటీ కేసు నమోదయింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్ చిక్కుల్లో పడ్డారు. తనను ఆర్థికంగా మోసం చేయడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ సాంగ్లీకి చెందిన సామాజిక కార్యకర్త, నటుడు, స్మృతి మంధాన స్నేహితుడు అయిన విజ్ఞాన్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా సాంగ్లీ సిటీ పోలీసులు పలాష్ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విజ్ఞాన్ మానే ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పలాష్ ముచ్చల్ తన 'నజారియా' అనే సినిమా ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని విజ్ఞాన్‌ను నమ్మించారు. ఈ క్రమంలో 2024లో విజ్ఞాన్ నుంచి పలాష్ రూ. 25 లక్షలు తీసుకున్నారు. అయితే సినిమా పూర్తయిన తర్వాత కూడా తన డబ్బు తిరిగి ఇవ్వకుండా పలాష్ కాలయాపన చేస్తూ వచ్చారని బాధితుడు ఆరోపించారు.
గతేడాది నవంబర్ 22న పలాష్ ముచ్చల్ సాంగ్లీకి వచ్చినప్పుడు, విజ్ఞాన్ తన స్నేహితులతో కలిసి ఆయన్ను డైరెక్టుగా కలిశాడు. ఆ సమయంలో తన డబ్బు తిరిగి అడగ్గా, పలాష్ నిరాకరించడమే కాకుండా ఒక వర్గంపై తీవ్రమైన కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ముంబైలోని తనకున్న పలుకుబడితో శారీరకంగా హాని చేస్తానని బెదిరించారని, దీనివల్ల తాను తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యానని విజ్ఞాన్ మానే మీడియాకు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన సాంగ్లీ పోలీసులు పలాష్ ముచ్చల్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 351, 302, 352తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3(1)(R)(S) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పలాష్ ముచ్చల్ ను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీస్ టీమ్స్ ముంబైలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.






